Top 5 This Week

Related Posts

మావోయిస్ట్ కమాండర్ పాపారావు టీం లొంగుబాటు దృశ్యాలు

ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సబ్యుడు, సౌత్ బస్తర్ డిప్యూటీ జోనల్ బ్యూరో ఇంఛార్జి పాపారావు సహా 18 మంది నక్సల్స్ మంగళవారం బీజాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. డీకేఎస్‌జెడ్‌సీ సభ్యుడు పాపారావు, డీవీసీఎం ప్రకాష్ మాడ్వి, డీవీసీఎం అనిల్ టాటిలతోపాటు ఏడుగురు మహిళా నక్సలైట్లు కూడా లొంగిపోయినవారిలో ఉన్నారు.

అధునాతన ఏకే-47లతోపాటు మరికొన్ని తుపాకులను కూడా లొంగిపోయిన నక్సల్స్ పోలీసులకు స్వాధీనం చేశారు. హింసను విడనాడి ప్రశాంత జీవనాన్ని కొనసాగించేందుకు పాపారావు సహా 18 మంది మావోయిస్టుల లొంగుబాటను ఆశ్రయించినట్లు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం జరిగిన ఈ కీలక ఘటన నక్సల్స్ రహిత బస్తర్ సాధించాలనే సంకల్పానికి వాస్తవ రూపంగా ప్రభుత్వం అభివర్ణించింది. ప్రస్తుతం దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమ చరిత్రలోనే తొలిసారిగా ఆ పార్టీకి నాయకత్వం లేకుండా పోయిందని పేర్కొంది.

లొంగిపోవడానికి తన టీంతో అడవి నుంచి బయటకు వస్తున్న మావోయిస్ట్ నేత పాపారావు

బస్తర్ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షలకు, ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా బస్తర్ ఇప్పుడు సరికొత్త శక్తితో, నూతన ఉత్సాహంతో, సానుకూల గుర్తింపుతో బలంగా ఆవిర్భవించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం చిన్న చిన్న టీంలుగా పనిచేస్తున్న మిగిలిన మరికొందరు నక్సల్స్ కూడా రాబోయే రోజుల్లో శాంతిమార్గాన్ని ఎంచుకుని జనజీవన స్రవంతిలోకి వస్తారని ఆశిస్తున్నట్లు ఛత్తీస్ గఢ్ పోలీసులు పేర్కొన్నారు.

Popular Articles