Top 5 This Week

Related Posts

భారీ అగ్ని ప్రమాదం: 18 మంది సజీవ దహనం

ఢిల్లీ: ఢిల్లీలో బుధవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్ లోని ఓ రెస్టారెంట్ లో జరిగిన ఈ దుర్ఘటనలో 18 మంది సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇదే రెస్టారెంట్ లో మరో 30 మందికిపైగా చిక్కుకుని ఉంటారని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

సహాయక చర్యల ద్వారా ఇప్పటికే సుమారు పది మందిని ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది రక్షించారు. వీరిని చికిత్స కోసం సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్ అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Popular Articles