‘ఇదిగో రవిచంద్రా..! వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నీపైనే ఎక్కువ భారం పడొచ్చు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన పార్టీ అత్యధిక సీట్లు సాధించాల్సిందే. రాజ్యసభ సభ్యునిగా రెండోసారి అవకాశం కల్పించి బీసీ బిడ్డకు కేసీఆర్ పెద్దపీట వేశారు. పార్టీపరంగా కేసీఆర్ కల్పించిన ఈ అవకాశంతో గులాబీ పార్టీని మరింత పటిష్టం చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక అసెంబ్లీ సీట్లను గెలిపించే బాధ్యత మున్ముందు నీ భుజ స్కంధాలపైనే ఉండొచ్చు.. కష్టపడి పని చేయ్.. నీకు లెఫ్టున రవీందర్ రావు, రైట్ లో నామా, ఆ పక్కనే తాతా మధు కూడా ఉన్నారు. మిగతా నాయకులను కూడా కలుపుకుని కష్టపడు.. నీ భవిష్యత్తు కేసీఆర్ చేతిలో సురక్షితం.. అందుకు భరోసా నాది’: కేటీఆర్
(బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సత్తుపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో ఆయన సంభాషిస్తున్న ఫొటోకు ‘సమీక్ష’ సరదాగా రాసిన వాక్యాలివి. చిత్రంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, తాతా మధు కూడా ఉన్నారు)

