Top 5 This Week

Related Posts

అమెరికా ‘ఇజ్జత్’ తీసిన ట్రంప్!

డోనాల్డ్ ట్రంప్ తన రెండ్రోజుల చైనా పర్యటనలో సాధించుకున్న ప్రయోజనాల సంగతేమోగాని, తన దేశం పరువు తీశాడు. ఆయా అంశాలేమిటో సంక్షిప్తంగా సమీక్షిస్తే..

  • 1) అమెరికా క్షీణిస్తున్న దేశమని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తనతో చెప్పినట్టు సోషల్ మీడియాలో రాసుకున్నాడు. అయితే తన కంటే ముందు అధ్యక్షుడిగా ఉన్న జో బైడైన్ హయాంలో నిజాంగానే అమెరికా బలహీనపడిందని సమర్థించుకున్నాడు.
  • 2) ప్రస్తుత అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న మార్క్ రుబియోను తమ దేశంలోకి ప్రవేశించకుండా చైనా 2020లో నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయకుండా ఆయన పేరు మార్చి అనుమతించింది. ఒక అమెరికా మంత్రికి గతంలో ఇలా ఎప్పుడు జరగలేదు.
  • 3) తైవాన్ విషయంలో సైనిక ఘర్షణ తలెత్తకుండా చూసుకోవాలని జిన్ పింగ్ హెచ్చరించారు. అంటే తాము తైవాన్ ను ఆక్రమించుకుంటే మీరు జోక్యం చేసుకోవద్దని నేరుగా చెప్పడమన్నమాట. పర్యటన ముగించుకుని వెళ్లిన ట్రంప్ సోషల్ మీడియాలో తైవాన్ చైనాకు 59 మైళ్ల దూరంలో ఉందని, అమెరికాకు 9,500 మైళ్ల దూరాన ఉంది.. అంటూ నర్మగర్బంగా వ్యాఖ్యానించారు. దీన్ని అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. తైవాన్ ను ఆక్రమించుకుంటే ఎక్కడో దూరాన ఉన్న మేమెందుకు కల్పించుకుంటామని హామీ ఇచ్చినట్టే.
  • 4) ట్రంప్ జిన్ పింగ్ సమావేశమైన హాలులోకి ఆయుధంతో వెళ్తున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ను బయటకు గెంటి వేసింది చైనా సెక్యూరిటీ. గతంలో ఏదేశంలోనూ అమెరికాకు ఇంత అవమానం జరగలేదు.
  • 5) ట్రంప్ తన వెంట తీసుకు వెళ్లిన అమెరికా మీడియా కూడా తీవ్ర అవమానాల పాలైంది. మీడియా ప్రతినిధుల కదలికలను పూర్తిగా నియంత్రించారు సెక్యూరిటీ అధిాకారులు. చైనా అధికారులతో మాట్లాడకుండా కట్టడిచేసారు.

Popular Articles