వైరా: ఖమ్మం జిల్లా వైరా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) ఎ. వరప్రసాద్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 24,800 మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, అదుపులోకి తీసుకున్నట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వెల్లడించారు. పెనుబల్లి నుంచి ఖమ్మానికి ఇటుక తోలుకునేందుకు నాలుగు ట్రాక్టర్లు, ఐదు టిప్పర్ల నుంచి నెలకు రూ. 24,800 మొత్తాన్ని ఎంవీఐ వరప్రసాద్ డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బాధిత కాంట్రాక్టర్ తమను ఆశ్రయించగా, వలవేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమేష్ పేర్కొన్నారు. వైరాలోని తన కార్యాయలంలోనే వరప్రసాద్ లంచం స్వీకరిస్తుండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.

