Top 5 This Week

Related Posts

తమిళనాడులో బీజేపీ తెలంగాణా తరహా వ్యూహం!

బీజేపీ స్ట్రాటజీలో ఇది మరో కోణం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో, మీడియాలో ఒక విధమైన చర్చ మొదలైంది. ఫైర్ బ్రాండ్ అన్నామలైని దూరం పెట్టినందుకే ఎన్డీఏ నష్ట పోయిందనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఫలితాల సరళిని మరో కోణంలో చూస్తే బీజేపీ ఒక ఫర్ఫెక్ట్ స్ట్రాటజీతోనే వెళ్తోందనిపిస్తోంది.

బీజేపీ జాతీయ నాయకత్వానికి ప్రాంతీయ పార్టీల బలంపై స్పష్టమైన అవగాహన ఉంది.

కాంగ్రెస్ ను ఢీ కొట్టినంత సులువుగా ప్రాంతీయ పార్టీలను ఓడించలేమన్న విషయమూ ఆ పార్టీ పెద్దలకూ తెలుసు.

అందుకే ముందుగా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనపర్చాలన్న ఎత్తు గడను అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో పార్టీకి లాభం కలిగినా ఫర్వాలేదని… దీర్ఘ కాలంలో తమకే కలిసి వస్తుందన్న అంచనా కమల నాథులది.

బండి సంజయ్ కుమార్

ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ ను రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడమే. సంజయ్ వల్ల రాష్ట్రంలో అప్పుడు పార్టీకి చాలా ఊపు వచ్చింది. బీఆర్ఎస్ -కాంగ్రెస్ -బీజేపీ మధ్య త్రిముఖ పోటీ హోరా హోరీగా ఉంటుందనే విశ్లేషణలు జరిగాయి. అయితే బీజేపీ అధిష్టానం లెక్కలు వేరేలా ఉన్నాయి. సంజయ్ దూకుడు వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడుతున్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ పోరులో ఒక వేళ కాంగ్రెస్ గెలిచినా, మళ్ళీ ఎన్నికల్లో ఓడించగలం.. కానీ.., బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ తో వేగలేమని భావించిందన్నది నమ్మలేని నిజం.

మొత్తానికి కేసీఆర్ ను గద్దె దించడంలో అప్పుడు బీజేపీ సక్సెస్ అయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను మట్టి కరిపించే వ్యూహంతో ముందుకు వెళుతోంది. అప్పటికీ బలం సరిపోకుంటే ఇదే బీఆర్ఎస్ తో పొత్తు లేదా అవగాహన కుదుర్చుకున్నా ఆశ్చర్య పొనక్కర్లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు కదా? ఎవరి అవసరం వారిది!

అన్నామలై

తమిళనాడు లోనూ అదే ఫార్ములా..!
ఇక తమిళనాడులో గల సమీకరణల దృష్ట్యా అధికార డీఎంకేను ఓడించలేమనే అంచనా బీజేపీకి మొదటి నుంచీ ఉంది. ద్రవిడ రాజకీయాల్లో ఎక్కువగా కలగజేసుకుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని భావించింది. అందుకే ఏఐడీఎంకేను ముందు పెట్టి ఎన్నికలను ఎదుర్కొంది. ఫైర్ బ్రాండ్ అన్నామలై లాంటి నేతలు ఎక్కువగా తిరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు భారీగా చీలి అధికార DMKకే లాభం చేకూరే అవకాశం ఉంటుందని అంచనా వేసింది. అన్నామలైని సైలెంట్ చేసేసింది. ఆయన కూడా పార్టీ లైన్ లో ఫర్ఫెక్ట్ గా పని చేశారు. ఎంత వరకు కొట్లాడాలో అంత వరకు కొట్లాడారు. మొత్తానికి తాము గెలవక పోయినా, కొరకరాని కొయ్య లాంటి DMKను గద్దె దించడం లో సక్సెస్ కాగలిగారు. అతి పెద్ద పార్టీ గా అవతరించిన TVK తమతో కలిసి వస్తే సరే సరి… లేకుంటే రాబోయే రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.

ఇప్పటి వరకు కమలనాథులు ఫర్ఫెక్ట్ వ్యూహంతోనే ముందుకు సాగుతున్నారు. అలా అని భవిష్యత్ లోనూ ఈ వ్యూహాలన్నీ సక్సెస్ అవుతాయనే గ్యారంటీ లేదు. అయితే సెక్యులర్ పార్టీల నాయకుల ఓవరాక్షన్ తో హిందూ ఓట్లు ఏకీకృతం అవుతున్నాయి. మొన్నటికి మొన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విన్నారు కదా…? ఆమె బీజేపీని విమర్శించడంలో తప్పు లేదు. కానీ రామున్ని కోట్ చేయడం వల్లనే హిందువుల్లో నెగటివ్ ఇంపాక్ట్ పడుతోంది. ఇలాంటివన్నీ రాబోయే కాలంలోనూ బీజేపీకి కలిసొచ్చే అంశాలు.

నోట్ : ఏ పార్టీ కూడా అహోబిలం మఠం కాదు. అందరివీ ఓటు బ్యాంకు రాజకీయాలే.

ప్రజాస్వామ్య అపహాస్యం… రాజ్యాంగ ఉల్లంఘన లాంటి పదాలకు ఇప్పుడు విలువ లేదు. అందరికీ గెలుపే ముఖ్యం…! అధికారమే లక్ష్యం..!!

Popular Articles