ఖమ్మం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఖమ్మం మైనర్ బాలికపై అఘాయిత్యపు ఉదంతంపై నిరసన జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. ఈనెల 6వ తేదీన ఖమ్మం టూ టౌన్ ప్రాంతంలోని రాపర్తినగర్-2 ఏరియాలో పన్నెండేళ్ల బాలికపై కారు డ్రౌవర్ గౌస్ పాషా అఘాయిత్యానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. తన దురాగతం గురించి బాలిక బయటకు చెబుతుందనే భయంతో గౌస్ పాషా ఆమెను ఐదంతస్తుల భవనంపై నుంచి తోసి వేయగా, తీవ్ర గాయాలపాలైన ఆ బాలిక ప్రస్తుతం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
సంఘటన అనంతరం పోలీసులు గౌస్ పాషాను అరెస్ట్ చేసి, పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఘటన జరిగి 17 రోజులైనప్పటికీ, నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ ఖమ్మం నగరంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం నిరసన ర్యాలీలు జరుగుతుండడం గమానార్హం. బాలికను నిమ్స్ కు తరలించాక ఆమె పరిస్థితి ఎలా ఉందనే అంశంపై పలువువురు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధిత బాలిక తండ్రిని ‘సమీక్ష’ న్యూస్ ఫోన్ లో సంప్రదించగా, బాలిక ఆరోగ్య స్థితి గురించి ఆయన వివరించారు.
పాప ఇప్పుడిప్పుడే కొద్దిగా మాట్లాడుతున్నట్లు బాలిక తండ్రి చెప్పారు. తమ కూతురి చేతులకు ఆపరేషన్ చేసి రాడ్లు వేశారని, వెన్నుపూస ఆపరేషన్ కాస్త టైం పడుతుందని వైద్యులు తెలిపారన్నారు. పాప మంచం నుంచి లేచే పరిస్థితి కనిపించడం లేదని, జీవిత కాలం అలాగే ఉండాల్సి వస్తుందేమోననే అనుమానాన్ని డాక్టర్లు వ్యక్తీకరించారన్నారు. ఇప్పుడిప్పుడే కాస్త ఆహారం తీసుకుంటోందని బాలిక తండ్రి పేర్కొన్నారు. నిందితున్ని ఉరి తీయాలని, తమకు న్యాయం చేయాలని బాలిక తండ్రి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభ్యర్థింంచారు.
బాధిత బాలికను పరామర్శించిన NHRC సభ్యురాలు:
కాగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి. మంగళవారం పరారమర్శించారు. పాప పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. వెన్నెముక పూర్తిగా చితికి పోయిన కారణంగా పాప జీవితాంతం వీల్ చైర్ కే పరిమితం అవుతుందని డాక్టర్లు తెలియజేసినట్లు ఆమె చెప్పారు. పాపను నిమ్మ్స్ డాక్టర్ల ప్రత్యేక బృందం అనుక్షణం పర్యవేక్షిస్తోందని, పాప పూర్తి ఆరోగ్య పరిస్థితి సమగ్రంగా రిపోర్ట్ తీసుకున్నామని తెలిపారు.
పాప తల్లిదండ్రులు నిరక్ష్యరాస్యులని, ఎలా పాపను జీవితాంతం చూసుకుంటావు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం సహాయం కావాలని బదులిచ్చారని విజయభారతి చెప్పారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సంఘటన జరిగిన భవనం, స్థలాన్ని సందర్శిస్తుందని, సమగ్ర నివేదికతో ఢిల్లీకి వెళ్ళాక పాప విషయంలో ఒక నిర్ణయానికి వస్తామన్నారు. పాపకు జరిగిన అన్యాయం, ఆమె మీద జరిగిన క్రూర దాడిని ఖండిస్తున్నామని, నేరస్థులకు శిక్ష ఖచ్చితంగా పడుతుందని, పాపకు న్యాయం చేసేంతవరకు వరకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆమెకు అండగా ఉంటుందని విజయభారతి స్పష్టం చేశారు.

కాగా మైనర్ బాలికపై లైంగిక దాడి, హత్యాయత్నం చేసిన గౌస్ పాషాను ఉరి తీయాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరుతూ రజక సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేసి గౌస్ పాషాను ఉరి తీయాలనీ కోరారు. ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని. ప్రభుత్వ పథకాలు అందజేయాలని కోరుతూ రజక సంఘాలు, బహుజన సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని బురహాన్ పురం జెండాల సెంటర్ నుండి పెవిలియన్ గ్రౌండ్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో రజక సంఘం జిల్లా నాయకుడు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య, మాజీ కార్పొరేటర్లు బి. శ్రీనివాసరావు, బుర్రి వెంకట్, నాయకులు ఆకుల గాంధీ, బహుజన సంఘాల జిల్లా నాయకులు కత్తి నెహ్రూ గౌడ్, బోడా వీరన్న, మాజీ కౌన్సిలర్ పువ్వాడ పార్థసారధి, డోకుపర్తి సుబ్బారావు, పగడాల నాగేందర్, ఉద్యమ కారుల సంఘం నాయకులు డాక్టర్ కేవీ కృష్ణారావు, లింగనబోయిన సతీష్, రేగళ్ల సీతారాములు, గుండ్లపల్లి శేషు,మిట్టపల్లి శంకర్, సట్ల వెంకటేశ్వర్లు, సుంకేషుల వెంకటేశ్వర్లు గోరంట్ల రవి, బానోత్ భద్రు నాయక్, జక్కుల వెంకటరమణ, రేగళ్ల కొండలు, బాసాటి హనుమంతరావు, రేగముడి రామకృష్ణ, పగిళ్లపల్లి రాజు,కండ్రాతి వెంకన్న, దాసరి మధులు పాల్గొని మాట్లడారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నాయకులు మన్నే వెంకటరమణ, 50వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీరెడ్డి రమేష్, పేరెల్లి విజయ్ కుమార్, గొట్టెపర్తి శ్రీనివాస్, మాలమహానాడు సంఘం జిల్లా అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, రజక సంఘం నాయకులు రేగళ్ల కొండలు, తెనాలి వీరబాబు, గోలి రామారావు, గోనేల శివ, బోనగిరి ఉపేందర్, పగిల్ల బుచ్చిబాబు,గోనెల రవిశంకర్, పిల్లుట్ల కృష్ణ, జక్కుల శ్రీనివాస్, కొలిపాక వెంకట్, వట్టెకోటి అప్పారావు, వట్టెకోటి వెంకన్న, జక్కుల పద్మ, జక్కుల మౌనిక, మాధురి, శిరీష, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

