హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్ ఎస్ఐ వి. నర్సింహులను ఏసీబీ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఓ కేసులో నిందితుడైన వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు, తదనంతరం అతన్ని ఎటువంటి వేధింపులకు గురి చేయకుండా ఉండేందుకు ఎస్ఐ నర్సింహులు రూ. లక్ష మొత్తాన్ని అతని నుంచి లంచంగా డిమాండ్ చేశాడు. ఇందులో తొలివిడతగా రూ. 50 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరించగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ఎస్ఐ నరసింహులు లంచంగా తీసుకున్న రూ. 50 వేల నగదును స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు. ఎస్ఐని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

