ఖమ్మం: ఖమ్మం జిల్లా పర్యటనలో అధికార పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో హిట్లర్ రాజ్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యమంటే పేదలకు ఇండ్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, తెలిసో, తెలియకో పేదోడు కబ్జా చేస్తే పట్టాలు ఇవ్వాలన్నారు. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాధపాలెం మండలం సర్వేనెంబర్ 218లో ప్లాట్లు కోల్పోతున్న బాధితులు మంగళవారం హరీశ్ రావును కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు తన ప్రసంగంలో ఇంకా ఏమన్నారో.. ఆయన మాటల్లోనే:
- మొన్న వెలుగుమట్ల ఇప్పుడేమో రఘునాథపాలెంలో షురూ చేశారు.
- వెలుగుమట్లలో పేదల జోలికి వస్తే రాష్ట్రమంతా కాంగ్రెస్ ప్రభుత్వ పరువు పోయింది.
- వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. సోయి రాలేదు.
- గతంలో సర్వే నెంబర్ 218 లో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు , స్థలాలు ఇచ్చింది.
- కరెంటు పోల్స్ , నల్లా కలెక్షన్లు ఏర్పాటు, ప్లాట్లకు నెంబర్లు కూడా కేటాయించింది.
- చాతనైతే మీరు ఇల్లు కట్టించండి.
- ఇంటికి సాయం చేయండి. అసంపూర్తిగా ఉంటే పూర్తి చేయాలి. కానీ ఇల్లు లాక్కునే పరిస్థితి బాధాకరం
- తక్షణమే ఆ ఆలోచన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
- కలెక్టర్ గారికి చెప్పాను .
- అమాయకుల దగ్గర, పేదల దగ్గర జాగాలు లాక్కోద్దని గట్టిగా చెప్పాను.
- రాత్రికి రాత్రి జేసీబీలు తెచ్చి ఇండ్లు కూలగొడుతున్నారు
- ఇల్లు కట్టే ప్రభుత్వం కాదు ఇది, కూల్చే ప్రభుత్వం.
- జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తే అది కూడా ఆక్రమించుకున్నారు.
- కేసీఆర్ క్యాబినెట్ లో పెట్టి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు.
- తక్షణమే ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
- లేదంటే జర్నలిస్టులకు మేమే పొజిషన్ ఇప్పిస్తాం .. మేము వాళ్లతో పాటు వెళ్లి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం.
- ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.
- హైదరాబాదులో ఫ్యూచర్ సిటీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటున్నారు, అక్కడ ఇబ్బంది లేనప్పుడు ఖమ్మంలో కేసీఆర్ ఇచ్చిన జీవో వల్ల ఎక్కడ ఇబ్బంది వస్తుంది?
- అయినా పేదల ఇండ్లు కూల్చడం ఏంటి.. ? వెలుగుమట్ల తర్వాత కూడా మీ కళ్ళు చల్లబడలేదా
- వెలుగుమట్ల పేదల కన్నీళ్లు చూశాక కూడా రఘునాథపాలెంలో అదే చేయాలనుకుంటున్నారా ?
- పిచ్చిపిచ్చి ఆలోచనలు విరమించుకోండి.
- నేషనల్ హైవే పేరుతో కొన్ని, ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో కొన్ని ప్లాట్లు తీసుకున్నారు.
- అన్ని పోయినా మిగిలిన ప్లాట్లు కూడా ఎందుకు లాక్కుంటున్నారు?
- పేదలు స్కూల్ పక్కన, జాతీయ రహదారి పక్కన ఇల్లు కట్టుకుంటే మీ కళ్ళు ఓర్వడం లేదా.. ?
- ఈ స్థలం విలువైంది కాబట్టి గరీబోళ్ల దగ్గర లాక్కుంటున్నారా..? వాళ్లకు ఇంత విలువైన స్థలాలు అవసరమా అనుకుంటున్నారా
- ఆనాడు కేసీఆర్ ఇచ్చారు. వాళ్ళ అదృష్టం బాగుంది భూముల ధరలు పెరిగాయి..
- కేసీఆర్ ఇచ్చిన ప్లాట్లకు పేదలను ఓనర్లను చేయండి. అంతేగాని ఆ ప్లాట్లు గుంజుకుంటామంటే ఊరుకోబోము.
- ఆలోచనలు విరమించుకోవాలని కోరుతున్నాం.
- గృహలక్ష్మి కింద కొందరికి ఇండ్లు మంజూరు అయితే బేస్మెంట్లు, ఇల్లు కూడా కట్టుకున్నారు..
- వాటిని కూల్చడం దారుణం.
- ఆలోచన విరమించుకోవాలి
- లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం..
- బీఆర్ఎస్ పార్టీ వీరందరికీ న్యాయం జరిగే వరకూ అండగా ఉంటదని హెచ్చరిస్తున్నా.
- రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శమంటున్నారు. హిట్లర్ ను చూసి హైడ్రా ఏర్పాటు చేసినా అంటున్నారు ..
- ఎవరైనా హిట్లర్ ను ఆదర్శంగా తీసుకుంటారా..?
- నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది .
- రెండున్నర ఏండ్లు పూర్తయిపోయింది నీ పాలనకు.
- పేదల ఉసురు పోసుకోకు, పేదలు తిరగబడే రోజులు వస్తాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా.
- ఆసుపత్రులను , కాలేజీలను బ్రతికించు.
- నీ పనుల వల్ల ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేటు దావఖానాలు, కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చింది.
- ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అన్నారు. ఆ స్కీమ్ ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు..
- నువ్వు పైసలు ఇవ్వవు అని హాస్పిటల్ వాళ్ళు ఈ పథకంలో చేరబోమంటున్నారు
- కానీ 1.5% శాతం మాత్రం ఉద్యోగుల జీతం కట్ చేశావు
- ఇదేమని ఉద్యోగస్తులు అడిగితే, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఏసీబీ రైడ్లు చేయిస్తున్నారు
- ఉద్యోగస్తులు, జర్నలిస్టులు , ప్రైవేట్ కాలేజీలు , ప్రతిపక్ష నాయకులను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..
- చివరికి పేదలను కూడా గత ప్రభుత్వం ఇచ్చిన జాగాను ఖాళీ చేయమని బెదిరిస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
- బ్లాక్ మెయిల్ ఎల్లకాలం నడవదు. గెలవదు. ప్రేమ, నిజాయితీ మాత్రమే గెలుస్తుంది
- ప్రేమ, అప్యాయత గెలుస్తుంది తప్ప, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చెల్లవు గాక చెల్లవు..
- మీరెవరు బాధపడొద్దు , వెనక కేసీఆర్ ఉన్నారు. మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది.
- కలెక్టర్ గారితో మాట్లాడాను , రేపు సీఎస్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను.
- అవసరమైతే మీ అందరినీ మీ జాగాలో కూర్చొబెట్టే దాక బీఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది.

