Top 5 This Week

Related Posts

లొంగిపోయిన భగీరథ్, బండి సంజయ్ కీలక ప్రకటన

హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన బండి భగీరథ్ అంశం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తన కుమారున్ని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ పోలీసులకు అప్పగించాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించిన విషయం కూడా విదితమే.

బండి సంజయ్ బాధ్యత తీసుకుని, తన కొడుకును విచారణకు పంపాలని, సంజయ్ నైతిక బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నానని, విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే పరిష్కారం లభించదని, తప్పయినా, ఒప్పయినా బాధ్యతగా వ్యవహరించాలని సంజయ్ కి సూచిస్తున్నానని, తక్షణమే తన కుమారున్ని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సీఎం రేవంత్ సంజయ్ కు హితవు పలికారు. నేపథ్యంలోనే బండి భగీరథ్ లొంగుబాటు పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

కాగా బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో శనివారం కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. బాధితురాలిని మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చగా, ఆమె వాంగ్మూలాన్ని, బాధితురాలి తల్లి స్టేట్మెంట్ ను దాదాపు 40 నిమిషాల పాటు నమోదు చేశారు. ఈ అంశంలో పోలీసులు ఇప్పటికే రెండుసార్లు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అంతకు ముందు ఉదయం జరిగిన పరిణామాల్లో బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఐదు టీంలుగా పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ లోని బండి సంజయ్ నివాసంలోనూ పోలీసులు భగీరథ్ కోసం తనిఖీ చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

Popular Articles