Top 5 This Week

Related Posts

రేపు నర్సంపేటకు కేసీఆర్: ‘పెద్ది’ కుటుంబానికి భారీ సాయం

నర్సంపేట: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటకు రానున్నారు. ఇటీవల హఠాన్మరణం చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు గులాబీ పార్టీ అధినేత నర్సంపేట నియోజకవర్గానికి వస్తున్నారు. సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నియోజకవర్గంలోని నల్లబెల్లికి కేసీఆర్ వెళ్లనున్నారు.

ఇంటి పెద్దను కోల్పోయి, శోక తప్త హృదయులైన పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి కష్ట కాలంలో ఆ ఫ్యామిలీకి కేసీఆర్ భరోసా ఇవ్వనున్నారు. ఇదే సందర్భంలో, నర్సంపేట నియోజకవర్గం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు అధినేత కేసీఆర్ గుండె ధైర్యం ఇవ్వనున్నారు.

పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సాయం:
కాగా తన నర్సంపేట పర్యటన ఖరారుకు ముందే కేసీఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భారీ మొత్తపు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈమేరకు రూ. 2.25 కోట్ల మొత్తాన్ని సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అందించనున్నారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం కేసీఆర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ మొత్తంలో సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల పేర్లపై కోటి రూపాయల చొప్పున బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేయనున్నారు. మిగతా రూ. 25.00 లక్షల మొత్తాన్ని సుదర్శరెడ్డి తల్లి అమృతమ్మ పేరుపై బ్యాంకులో ఫిక్సుడ్ డిపాజిట్ చేయించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. అంతేగాక సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఎల్లకాలం సుదర్శన్ రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

Popular Articles