Top 5 This Week

Related Posts

ఖమ్మంలో ప్రముఖ రియల్టర్ ఆస్తుల వేలం ప్రకటన!

ఖమ్మం: ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ రియల్టర్ ఆస్తులను ప్రఖ్యాత ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వేలానికి పెట్టింది. ఈమేరకు బహిరంగ వేలం అమ్మకపు నోటీసును జారీ చేసింది. ఈ పరిణామం ఖమ్మంలో కుదేలవుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలక ఉదాహరణగా ఆయా రంగపు వర్గాలు అభివర్ణిస్తున్నాయి.

ఖమ్మం నగరంలోని రుద్రమకోట వద్ద గల గుట్టపై , రఘునాథపాలెం మండలం జింకల తండా వంటి పలు ప్రాంతాల్లో రియల్ వెంచర్లు నిర్వహించిన గుర్రం ప్రకాష్ కు చెందిన స్థిరాస్తులను వేలం వేస్తున్నట్లు ప్రముఖ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించింది. తమ వద్ద తాకట్టు పెట్టి తీసుకున్న అప్పులకు సంబంధించి మిగతా బకాయి రూ. 5.73 కోట్ల మొత్తాన్ని రాబట్టుకునే ప్రక్రియలో భాగంగా వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది.

కాగా ఖమ్మంలోని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటున్నట్లు సమాచారం. ఒకరిద్దరు రియల్టర్లు ఐపీ దాఖలు దిశగా పయనిస్తున్నారనే ప్రచారమూ జరుగుతుండడం గమనార్హం. మొత్తంగా ఖమ్మంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలవుతోందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి.

Popular Articles