హైదరాబాద్: కొండా సుస్మిత వ్యాఖ్యల నేపథ్యంలో.. మంత్రి కొండా సురేఖ అంశంపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉందని, ఆ కమిటీ అన్నీ పరిశీలించి చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ విషయం పార్టీ అధిష్టానం, ఏఐసీసీ చూసుకుంటుందని, పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ప్రభుత్వ వేదికలపై తాను స్పందించకూడదన్నారు.
అందరూ పార్టీలో క్రమ శిక్షణకు కట్టుబడి ఉండాలని, త్వరలో అన్ని విషయాలు తెలుస్తాయని సీఎం చెప్పారు. ఊహాజనిత అంశాలను ప్రస్తావించరాదని మీడియాను సీఎం కోరారు. సురేఖ అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు సీఎం రేవంత్ ఆయా విధంగా స్పందించారు. లండన్ నుంచి తిరిగివచ్చిన సీఎం సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

