Top 5 This Week

Related Posts

ఏం కష్టమొచ్చిందో ఏమో..! రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

ఘట్‌కేసర్: ఏం కష్టమొచ్చిందో ఏమోగాని.. దంపతులిద్దరూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కలచివేసింది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం… వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీష దంపతులు రైలు కిందపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ) సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దంపతుల మృతితో పాపయ్యపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్యకు గల కారణాలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles