Top 5 This Week

Related Posts

కేసీఆర్ తో జత కలిసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ఎర్రవల్లి: మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లిలోని ఫాం హౌజ్ లో జీవన్ రెడ్డి కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేసీఆర్ ను కలిసేందుకు ఫాం హౌజ్ కు వెళ్లిన జీవన్ రెడ్డికి కేటీఆర్ సాదర స్వాగతం పలికారు. కేసీఆర్ తో కలిసి పని చేయాల్సిన అవసరముందని, ఇన్నాళ్లకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమని జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరికొద్ది రోజుల్లోనే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

Popular Articles