Top 5 This Week

Related Posts

బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదు

హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథపై పేట్ బషీరాబాద్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బండి భగీరథ తనకు మద్యం తాగించి మొయినాబాద్ ఫాం హౌజ్ లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ పదిహేడేళ్ల బాలిక ఇచ్చి న ఫిర్యాదుపై పోలీసులు భగీరథపై బీఎన్ఎస్ చట్టంలోని 74, 75 సెక్షన్ల, పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

కాగా ఇదే బాలికపై లైంగికదాడి ఆరోణలు ఎదుర్కుంటున్న సంజయ్ కుమారుడు బండి భగీరథ కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. స్నేహం పేరుతో పరిచయమైన సదరు బాలిక కుటుంబ ఫంక్షన్లకు ఆహ్వానించేదని, పరిచయాన్ని ఆసరాగా చేసుకుని పెళ్లి పేరుతో తనను రూ. 5.00 కోట్లు డిమాండ్ చేయగా, తాను రూ. 50,000 ఇప్పటికే ముట్టజెప్పినట్లు తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈమేరకు బాలికపైన, ఆమె తల్లిదండ్రులపైన కరీంనగర్ పోలీసులు బీఎన్ఎస్ చట్టంలోని 308 (5), 351(2), 61(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Popular Articles