Top 5 This Week

Related Posts

TVK బలం @120.. రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం

చెన్నయ్: తమిళ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. రోజుకో మలుపు, గంటకో ట్విస్టు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోంది. అయితే తాజా పరిణామాల్లో టీవీకే పార్టీకి వీసీకే పార్టీ సైతం మద్ధతు తెలిపింది. విజయ్ పార్టీకి తాము మద్ధతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ నేత తిరుమావళవన్ టీవీకే నేత ఆదవ అర్జునకు లేఖ ఇచ్చారు. దీంతో టీవీకే విజయ్ పార్టీ బలం 118కి చేరింది. ఈ పరిస్థితుల్లోనే నిన్న మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గిన ఐయూఎంఎల్ పార్టీ ఈరోజు మళ్లీ మద్దతు తెలుపడంతో విజయ్ పార్టీకి గల సభ్యుల సంఖ్యా బలం 120కి పెరిగింది.

తాజా పరిణామాల్లో గవర్నర్ ను కలిసేందుకు టీవీకే చీఫ్ విజయ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం సాయంత్రం గవర్నర్ ను కలిసేందుకు విజయ్ ప్రయత్నించగా, ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు. దీంతో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ను కలిసేందుకు లోక్ భవన్ కు వచ్చిన టీవీకే చీఫ్ విజయ్ అనివార్యంగా వెనుదిరిగి తన ఆఫీసుకు వెళ్లక తప్పలేదు. ఈనెల 4వ తేదీన వెలువడిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీవీకే పార్టీ 108 చోట్ల విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.

UPDATE:
రేపే విజయ్ ప్రమాణ స్వీకారం:
తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే చీప్ విజయ్ ఆదివారం ప్రమాణా స్వీకారం చేయనున్నారు. చెన్నయ్ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మధ్యాహ్నం 3.00 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Popular Articles