Top 5 This Week

Related Posts

ఎట్టకేలకు డీఎస్పీ భీంరెడ్డి అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణాలో డీఎస్పీ భీంరెడ్డిని ఏసీబీ అధికారులు ఎట్టకేలకు సోమవారం అరెస్ట్ చేశారు. పీసీఎస్ (పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీబీ అధికారులు ఈనెల 2వ తేదీన ఆయన నివాసంలోనేగాక, సంబంధీకులకు చెందిన అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. భీంరెడ్డికి చెందిన ఆస్తులను ఏసీబీ అదేరోజు అధికారికంగా వెల్లడించింది. వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ. 200 కోట్లుగా వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఈ తరహా ఘటనల్లో నిందితుడైన ప్రభుత్వ ఉద్యోగిని సాధారణంగా 24 గంటల్లోపే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా డీఎస్పీ భీంరెడ్డిని మాత్రం ఏసీబీ అరెస్ట్ చేయలేకపోయింది. ఏసీబీ చరిత్రలోనే ఈ ఘటన ప్రప్రథమంగా వార్తలు వచ్చాయి. ఏసీబీ సోదాల నేపథ్యంలో అనారోగ్యానికి గురైన డీఎస్పీ భీంరెడ్డి ఆసుపత్రిలో చేరడం వల్లే అరెస్టులో జాప్యం జరిగినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎస్పీ భీంరెడ్డి సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగానే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Popular Articles