Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

చిక్కుల్లో యూ ట్యూబర్ రఘు: ఖమ్మం జిల్లా పోలీస్ స్టేషన్లలో వెల్లువలా ఫిర్యాదులు

ఖమ్మం: యూ ట్యూబర్ గంజి రఘు చిక్కుల్లో పడ్డారు. రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అభిమానులు, అనుయాయులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రఘుపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. ఉమ్మండి ఖమ్మం జిల్లాలోని అనేక పోలీస్ స్టేషన్లలో తుమ్మల అనుయాయులు చేస్తున్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసత్య, అర్థరహిత ఆరోపణలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై నోరు పారేసుకున్న యూ ట్యూబర్ రఘును తక్షణమే చట్టరీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తూ లిఖత పూర్వక ఫిర్యాదులు చేస్తున్నారు.

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో వేసుకున్న ఇండ్ల తొలగింపు ప్రక్రియను అసత్య, వాస్తవ దూరమైన కల్పితాలతో మంత్రి తుమ్మలపై రఘు చేసిన అనుచిత వ్యాఖ్యల వల్ల ఆయన గౌరవానికి భంగం కలిగిందని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పట్టణ కాంగ్రెస్ నాయకుడు మిక్కలినేని నరేందర్, మాజీ కౌన్సిలర్ కిలారు బాబ్జీ, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి యడ్లపల్లి సంతోష్, NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ తదితరులు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

గంజి రఘుపై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్న మిక్కిలినేని నరేంద్ర తదితరులు

అదేవిధంగా భద్రాద్రి జిల్లా దమ్మపేటలో, ఖమ్మం త్రీ టౌన్, జిల్లాలోని రఘునాథపాలెం, పెనుబల్లి, సత్తుపల్లి, కల్లూరు, వేంసూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని మరికొన్ని స్టేషన్లలోనూ ఇదే అంశంపై రఘుపై స్థానిక కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఫిర్యాదులపై ఇప్పటివరకైతే ఇంకా ఎక్కడా కేసులు నమోదు కాలేదని తెలిసింది. కాగా ఈ ఫిర్యాదులపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు జిల్లాలోని ఓ పోలీసు అధికారి ‘సమీక్ష’ న్యూస్ కు చెప్పారు. మొత్తంగా యూ ట్యూబర్ గంజి రఘు తుమ్మలపై చేసినట్లు పేర్కొంటున్న అనుచిత వ్యాఖ్యలపై ఆయన అభిమానులు, అనుయాయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

Popular Articles