హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 89 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం జీవోఆర్టీ నెం. 574 ద్వారా ఉత్తర్వు జారీ చేసింది. కమిషనర్ల బదిలీకి సంబంధించి ఎండార్స్మెంట్ ఉత్తర్వును మున్సిపల్ జాయింట్ డైరెక్టర్ థ్రిల్లేశ్వర్ రావు జారీ చేశారు. ఎండార్స్మెంట్ ఆర్వోసీ నెం. e973121/2026/A2 ప్రకారం బదిలీకి గురైన ఆయా అధికారుల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం వీరందరికీ ఏయే స్థానాలు కేటాయించారనే అంశం ఎండార్స్మెంట్ ఆర్వోసీ నెం. e973121/2026/A2 ఆర్డర్ లో వివరంగా ఉంటుంది. ఈ ప్రతిని సంబంధిత అధికారులకు పంపించినట్లు అధికార వర్గాలు చెప్పాయి.




