ఖమ్మం: ఖమ్మం నగరంలో భారీ చోరీ ఘటనన జరిగింది. బంగారు వ్యాపారుల నిలువెత్తు నిర్లక్ష్యం దొంగలకు సదవకాశంగా మాారినట్లు సమాచారం. ఫలితంగా రూ. 55 లక్షల విలువైన బంగారం, వెండి దొంగలపాలైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బంగారం వర్తకులు వంకాయల కార్తీక్ తోపాటు మరో వ్యక్తి తమ దినచర్యలో భాగంగా ఖమ్మంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో షాపును మూసేసి, సమీపంలోనొ ఓ ప్రాంతంలో గత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో టిఫిన్ చేస్తున్నారు. ఈ సందర్బంగా తమ ద్విచక్ర వాహనాన్ని అక్కడే పార్క్ చేశారు. అయితే వీరి కదలికలను గమనించిన దొంగలు పార్క్ చేసిన ద్విచక్ర వాహనానికి తగిలించిన 350 గ్రా. బంగారం కడ్డీలు, మరో 2.00 కిలోలకుపైగా వెండి సంచిన దొంగలు తీసుకుని ఎంచక్కా వెళ్లిపోయారు. చోరీకి గురైన బంగారం, వెండి విలువ రూ. 55.00 లక్షలు ఉంటుందని బాధిత వ్యాపారులు చెబుతున్నారు. ఘటనపై ఖమ్మం త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

