Top 5 This Week

Related Posts

నిరుద్యోగులకు టీజీపీఎస్సీ గుడ్ న్యూస్

హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఈమేరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో గల 290 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆర్ అండ్ బీలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఏఈ) సివిల్ ఇంజనీర్ పోస్టులకు, 49 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.

సివిల్ విభాగంలో ఏఈఈ పోస్టులకు ఈనెల 6వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు, ఎలక్ట్రికల్ విభాగంలో ఏఈఈ పోస్టులకు ఈనెల 8వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు, పీసీబీలో ఏఈఈ పోస్టులకు ఈనెల 10వ తేదీ నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్లలోని పూర్తి వివరాకలు తమ అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత సూచించారు.

Popular Articles