Top 5 This Week

Related Posts

ఖమ్మంలో సీఐపై ‘ఛీటింగ్’ కేసు నమోదు

ఖమ్మం: ఖమ్మం నగరంలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై పోలీసులు ‘ఛీటింగ్’ కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పోలీసు శాఖలో తీవ్ర కలకలం రేపింది.

పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ఖమ్మం సెంట్రల్ క్రైం స్టేషన్ లో సీఐగా విధులు నిర్వహిస్తున్న భూక్యా రాజు నాయక్ అనే పోలీసు అధికారి పెళ్లి చేసుకుంటానని ఓ మహిళను వంచనకు గురి చేశాడు. గతంలో భర్త నుంచి విడాకులు తీసుకున్న తనను పెళ్లి పేరుతో మోసం చేశాడనే అభియోగంపై బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఖమ్మం టూ టౌన్ పోలీసులు సీఐ రాజు నాయక్ పై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. అయితే అరెస్టుకు ముందే రాజు కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నాడని పోలీసు వర్గాలు చెప్పాయి.

Popular Articles