హైదరాబాద్: తెలంగాణాలో పలువురు డీఎస్పీలను బదిలీ చేస్తూ రెండు రోజుల క్రితం జారీ అయిన ఉత్తర్వుల్లో పాక్షిక మార్పులు జరిగాయి. ఈమేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు.
ఇల్లెందు డీఎస్పీగా పోస్టింగ్ ఇచ్చిన ఎస్. సారంగపాణిని వైరా ఏసీపీగా బదిలీ చేస్తూ మార్పు చేశారు. ఇల్లెందు డీఎస్పీగా ఇంటెలిజెన్స్ లో గల యు. వెంకన్నబాబును బదిలీ చేశారు. అదేవిధంగా వైరా ఏసీపీగా పోస్టింగ్ ఇచ్చిన పద్మనాభుల శ్రీనివాస్ ను తిరిగి జీహెచ్ఎంసీ అదనపు ఎస్పీగా పోసింగ్ ఇచ్చారు. సైబరాబాద్ స్పెషల్ బ్రాంచ్ విభాగపు ఏసీపీగా ఉన్నటువంటి బి. ప్రకాష్ ను నిజామాబాద్ ఏసీపీగా, అక్కడ పనిచేస్తున్న ఎల్ఆర్ వెంకటరెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ ఉత్తర్వు వెలువడింది.


