హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. సబ్ డివిజనల్ పోలీసు అధికారులుగా వ్యవహరించే ఈ అధికారులను కమిషనరేట్లలో ఏసీపీలుగా, జిల్లా ఎస్పీ పరిధిలో డీఎస్పీలుగా బదిలీ అయ్యారు. స్థాన చలనానికి గురైన డీఎస్పీ/ఏసీపీల వివరాలు ఇలా ఉన్నాయి.
కె. నరసింగరావు ను నార్కోటిక్ బ్యూరో నుంచి ఉస్మానియా యూనివర్సీటీకి, జి. జగన్ ను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్, ఇంటెలిజెన్స్ లో గల కె. పురుషోత్తమరెడ్డిని జగిత్యాలకు, ఇక్కడ గల డి. రఘుచందర్ ఇంటెలిజెన్స్ కు, ఎస్. మధుసూదన్ ను ఇంటెలిజెన్స్ నుంచి కామరెడ్డికి, సి. అంజయ్య మల్కాజిగిరి నుంచి వికారాబాద్ కు, టి. రాజశేఖర్ రెడ్డిని సెక్రటేరియల్ సెక్యూరిటీ నుంచి మల్కాజిగిరికి బదిలీ చేస్తూ, ఎన్. శ్రీనివాసరెడ్డిని వికారాబాద్ నుంచి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా బి. అశోక్ ను సైబర్ సెక్యూరిటీ నుంచి ఆసిఫాబాద్ కు, ఎం. అరుణ్ కుమార్ ను ఇంటెలిజెన్స్ నుంచి భద్రాచలానికి, పి. శ్రీనివాస్ ను ఇంటెలిజెన్స్ నుంచి నిర్మల్ కు, వై. వెంకటరెడ్డిని కుషాయిగూడ నుంచి ఉప్పల్ కు బదిలీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ లో గల జి. రణవీర్ రెడ్డిని చిక్కడపల్లికి, ఎల్. రమేష్ కుమార్ ను చిక్కడపల్లి నుంచి డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్, ఎల్ఆర్ వెంకటరెడ్డిని టాస్క్ ఫోర్స్ నుంచి మలక్ పేటకు బదిలీ చేస్తూ, కె. సుబ్బరామిరెడ్డిని మలక్ పేట నుంచి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలన్నారు.
కె. చంద్రశేఖర్ రెడ్డిని మలక్ పేట ట్రాఫిక్ నుంచి గోషామహల్ కు , ఎస్. సుదర్శన్ ను గోషామహల్ నుంచి డీజీపీ ఆఫీసుకు, కె. శ్రీనివాస్ ను సీఐడీ నుంచి ఆసిఫ్ నగర్ కు బదిలీ చేస్తూ, బి. కిషన్ కుమార్ ను ఆసిఫ్ నగర్ నుంచి డీజీపీ ఆఫీసుకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక వై. వెంకటేశ్వర రావును సైబర్ సెక్యూరిటీ నుంచి మేడ్చల్-జీడిమెట్ల ట్రాఫిక్ కు, కె. వెంకటరెడ్డిని మేడ్చల్ నుంచి డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

