Top 5 This Week

Related Posts

సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి భావోద్వేగం., కంటతడి

సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కంటతడి పెట్టారు. డిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్ దృశ్యాలను స్క్రీన్ పై చూసిన ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. సోనమ్ వాంగ్ చుక్ దీక్షను భగ్నం చేసి, విద్యార్థులను చితకబాదడం అమానుషమని రాగమయి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విద్యార్థుల నిరసన ర్యాలీకి బాసటగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీల అక్రమ నిర్బంధం ప్రజాస్వామ్యానికి విరుద్ధ చర్యగా పేర్కొన్నారు.

ఢిల్లీలో నిన్న రాహుల్, ప్రియాంకా గాంధీల అరెస్టును నిరసిస్తూ సత్తుపల్లిలో బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న దృశ్యాలివి..

Popular Articles