Top 5 This Week

Related Posts

నాంపల్లి నుమాయిష్ ప్రారంభం

హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్ (ఎగ్జిబిషన్)ను తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం ఓ చిన్న గ్రామంగా మారిన నేపథ్యంలో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రపంచ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. గత పాలకులు ఎగ్జిబిషన్ సొసైటీని ప్రోత్సహిస్తామని అనేక హామీలు ఇచ్చారేగాని అమలు చేయలేదన్నారు. నుమాయిష్ హైదరాబాద్ నగరానికే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఉత్సవమని భట్టి అన్నారు.

నుమాయిష్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గ్లోబల్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ ను అత్యంత సేఫ్ నగరంగా రూపొందించాలని ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని భట్టి తెలిపారు. కాలుష్యరహితంగా, 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా, పూర్తి శాంతి భద్రతలతో కూడిన నగరంగా హైదరాబాదును రూపొందించే ఆలోచనలో ప్రజా ప్రభుత్వం ఉందన్నారు. అందులో సొసైటీ సభ్యులు భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Popular Articles