హైదరాబాద్: తెలంగాణా డిప్యూటీ సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్వో) మారబోయిన మధుసూదన్ తీవ్రమైన గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో మధుసూదన్ తన తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం ఛాతీ నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో మధుసూదన్ చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో కార్డియాక్ అరెస్టు కావడంతో సమీపంలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స నిర్వహిస్తున్న సమయంలో మరో మారు కార్డియాక్ అరెస్ట్ కావడంతో మధుసూదన్ మరణించరాు.
నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి సంస్థలలో స్టాఫ్ రిపోర్టర్ గా, బ్యూరో ఇంఛార్జిగా మధుసూదన్ పనిచేశారు. విధి నిర్వహణలో నికార్సైన పాత్రికేయుడిగా పనిచేశారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద సీపీఆర్వోగా చేరి, విధులు నిర్వహిస్తున్నారు.

మారబోయిన మధుసూదన్ మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి బట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత నిజాయితీ గల పాత్రికేయన్ని కోల్పోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. వృత్తిపట్ల ఆయన అత్యంత నిబద్ధత కలిగిన పాత్రికేయుడని భట్టి చెప్పారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి ఆత్మస్థైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఆ కుటుంబానికి అండగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మిత్రుడు మధుసూదన్ మరణం పట్ల ‘సమీక్ష’ న్యూస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతోంది.

