తెలంగాణా డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న శివధర్ రెడ్డి 1994 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. వచ్చే నెల 1వ తేదీన ఆయన తెలంగాణా కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

- హైదరాబాద్ లో జన్మించిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందిన అధికారి.
- ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్ లో చదువుకున్న శివధర్ రెడ్డి.
- ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గా practise చేసి తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994 లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లోకి ప్రవేశం.
- ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేసిన శివధర్ రెడ్డి.
- గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్ గా, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలు.
- జిల్లాల ఎస్పీగా, DIG SIB గా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించిన శివధర్ రెడ్డి.
- 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన శివధర్ రెడ్డి.
- 2016 నయీం ఎన్కౌంటర్లో ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసిన శివధర్ రెడ్డి.
- ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడ పని చేసిన శివధర్ రెడ్డి.
- నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను పర్యవేక్షించిన శివధర్ రెడ్డి.
- 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపి గా శివధర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం.
- అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడిన శివధర్ రెడ్డి.
- విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా పనిచేసిన సమయంలో రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహణ.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్ గా, డైరెక్టర్ గా పనిచేసిన శివధర్ రెడ్డి.
- పర్సనల్ వింగ్ లో ఐజి, అడిషనల్ డీజీగా పని చేసిన శివధర్ రెడ్డి.
- అడిషనల్ డీజీపీ రోడ్ సేఫ్టీ గానూ అనుభవం.
- 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకం.
- ఆగస్టు 2024 లో డీజీపీగా ప్రమోషన్.
- గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్న శివధర్ రెడ్డి


