హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగార్థులకు తెలంగాణా ప్రభుత్వ శుభవార్త చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికే పెంచిన ఏడేళ్లకు ఇది మరో మూడేళ్లు అదనం కావడం గమనార్హం. మొత్తంగా పదేళ్ల వరకు వయోపరిమితిలో ప్రభుత్వం సడలింపునిచ్చింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా కానిస్టేబుల్‌తో సమాన హోదా పోస్టులకూ ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. కానీ పోలీస్ శాఖలో పీసీ డ్రైవర్ పోస్టులకు మాత్రం వర్తించదని, తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నియామకాలకు వర్తిస్తుందని వివరించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వు జారీ చేశారు. ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు..

