ఖమ్మం: తెలంగాణా డీజీపీ సీవీ ఆనంద్ శనివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సాయంత్రం వరకు డీజీపీ ఖమ్మం చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు తదితర అంశాలపై పోలీసు అధికార యంత్రాంగంతో ఆయన సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. స్థానికంగా ఏర్పాటు చేసిన కొన్ని కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని సమాచారం. అనంతరం రాత్రి ఇక్కడే బస చేసి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు అనధికార సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డీజీపీ ఆనంద్ రెండు రోజులపాటు పర్యటించనున్నారనే సమాచారంతో పోలీస్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.
Update:
కాగా డీజీపీ సీవీ ఆనంద్ ఖమ్మం జిల్లా పర్యటన వాయిదా పడింది. త్వరలోనే ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుందని పోలీసు వర్గాలు చెప్పాయి.

