హైదరాబాద్: కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన తెలంగాణా రక్షణ సేన (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆమెకు బిగ్ షాక్ ఇచ్చింది. ఈమేరకు కవితకు ఓ లేఖ రాస్తూ TRS పేరు మార్చాలని కీలక సూచన చేసింది. TRS పేరు కొనసాగించేందుకు వీల్లేదని, ఈ పేరుపై ప్రజల నుంచి పలు అభ్యంతరాలు వచ్చాయని ఈసీ పేర్కొంది. అందువల్ల పదిహేను రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు సమర్పించాలని, లేనిపక్షంలో పార్టీ పేరుకు సంబంధించిన దరఖాస్తును క్లోజ్ చేస్తామని ఈసీ స్పష్టం చేసింది.
అయితే పార్టీ పేరుకు సంబంధించి ఈసీ నుంచి వచ్చిన రెండు అభ్యంతరాలకు తాము సమాధానం ఇచ్చినట్లు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తాము కొత్త పేర్లు ఇచ్చేది లేదని, ఈ అంశంలో న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు కవిత ప్రకటించారు. మొత్తంగా కవిత స్థాపించిన TRS (తెలంగాణా రక్షణ సేన) పార్టీ పేరు సందిగ్ధంలో పడినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

