హైదరాబాద్: తెలంగాణా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగపు డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమ సంపాదన మరింత బహిర్గతమైంది. ఇటీవల ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఆయన బెడ్ కింద రూ. 1.10 కోట్ల నగదు లభ్యమైన సంగతి తెలిసిందే. ఏసీబీ సోదాల అనంతరం నరహరిని అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.
తాజాగా ఆయన బ్యాంకు లాకర్ కీ ఇచ్చేందుకు నరహరి కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో ఏసీబీ అధికారులు కోర్టు ద్వారా సర్చ్ వారంట్ ను తీసుకొచ్చి నరహరి బ్యాంక్ లాకర్ ను పగులగొట్టారు. లాకర్ లో రూ. 1.5 కోట్ల నగదు, 2.5 కిలోల బంగారం ఉన్నట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు.
నరహరికి చెందిన మరో రెండు లాకర్లు కూడా తెరవాల్సి ఉందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. మర్ోవైపు నరహరి బ్యాంక్ అకౌంట్ లో గల రూ. 5.00 కోట్ల నగదు మొత్తాన్ని ఏసీబీ అధికారులు ఫ్రీజ్ చేశారు.

