ఖమ్మం: ఖమ్మం V6 జిల్లా రిపోర్టర్ సయ్యద్ ఖదీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం నగరంలోని పార్సీబంధానికి చెందిన రాము సుధా అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఖదీర్ పైనేగాక, మరికొందరిపై బీఎన్ఎస్ చట్టంలోని 329(4),115(2), 324(2), 79, 351(2), 296(b), 118(1), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఖదీర్ తో పాటు అతనికి సంబంధించిన మరో 12 మంది తమ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశారని, తమను చంపడానికి ప్రయత్నించారనేది రాము సుధా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు సారాంశం. ఖదీర్ పై పోలీసులు ఈనెల 16వ తేదీన కేసు నమోదు చేయగా, గురువారం వెలుగులోకి వచ్చింది.
(కోర్టు శిక్షించినా మారని V6 రిపోర్టర్ ఖదీర్ తీరుపై “సమీక్ష”.. మరో కథనంలో…)
