Top 5 This Week

Related Posts

కొత్తగూడెం రైల్వే డివిజన్: ఎంపీ వద్దిరాజు లేఖకు రైల్వే మంత్రి స్పందన

ఢిల్లీ: భద్రాచలం రోడ్ (కొత్తగూడెం) కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేసే అంశం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ ఉపనేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని పేర్కొంటూ, రైల్వే డివిజన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించారు.

భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లకు చేరువవుతున్న సందర్బంగా, దాని చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ, కొత్తగూడెం కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఎంపీ రవిచంద్ర వినతిపత్రం అందజేసిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం నుంచి కిరండోల్, మల్కనగిరి, కొవ్వూరు రైల్వే లైన్లు ఏర్పడితే తెలంగాణ, ఛత్తిస్ ఘడ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానంగా ఉంటుందని ఆయన మంత్రికి వివరించారు.

ఎంపీ వద్దిరాజుకు రైల్వే మంత్రి రాసిన లేఖ ప్రతి

రవిచంద్ర వినతికి స్పందించిన అశ్విని వైష్ణవ్ ఈ సూచనను రైల్వే ఉన్నతాధికారుల పరిశీలనకు పంపామని చెప్పారు. పరిశీలన పూర్తికాగానే తదుపరి చర్యలు చేపడతామని కేంద్రమంత్రి ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు రాసిన ప్రత్యుత్తరంలో స్పష్టం చేశారు.

Popular Articles