గుండాల: అటవీ శాఖకు చెందిన బీట్ ఆఫీస్ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. భద్రాద్రి జిల్లా గుండాలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న బాణోత్ నరేష్ రూ. 10,000 మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీకి పట్టుబడ్డాడు. నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఓ పోడు భూమి రైతు నుంచి ఆయా మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ గుండాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులోనే ఏసీబీకి చిక్కాడు. ఘటనను ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై. రమేష్ ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావలసి ఉంది.

