Top 5 This Week

Related Posts

కర్నాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా జి. పరమేశ్వరతోపాటు మరో పన్నెండు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాత్ డీకే శివకుమార్ తో ముఖ్యమంత్రిగా, మిగతా వారిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్యాంగ మినీ పుస్తకాన్ని చేబూని డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.

లోక్ భవన్ లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణా, కేరళ, హిమాచల్ ప్రదేశ్ సీఎంలు రేవంత్ రెడ్డి, వీడీ సతీశన్, సుఖ్విందర్ సింగ్ సుఖులతోపాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు హాజరయ్యారు. కాగా మంత్రివర్గంలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేకు స్థానం దక్కింది.

Popular Articles