Top 5 This Week

Related Posts

హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హైకోర్టులో ఊరట

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు తెలంగాణా హైకోర్టులో ఊరట లభించింది. శాంతా శ్రీరామ్ కన్ష్ట్రక్షన్స్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు లోతుకుంట భూముల జోలికి వెళ్లొద్దని కూడా హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశిస్తూ, తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకీ వాయిదా వేసింది.

శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్సన్స్ కేసులో హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్ ను తప్పించాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. రంగనాథ్ స్థానంలో మరో సమర్ధుడైన అధికారిని నియమించాలని కూడా కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రంగనాథ్ మంగళవారం సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.

Popular Articles