Top 5 This Week

Related Posts

హైడ్రా అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసిన కాలేజీలు

హైదరాబాద్: హైదరాబాద్ ప్రాంతంలోని ఎనిమిది ప్రయివేట్ కళాశాలలు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాల ద్వారా ఫైర్ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించారనే అభియోగాలపై లేక్ పోలీసులు ఆయా కళాశాలలపై బీఎన్ఎస్ చట్టంలోని 337, 336(3), 340(2), 318(4), r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మెహిదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్, చంద్రాయణగుట్టలోని శ్రీచంద్ర, చిక్కడపల్లిలోని న్యూ ఎరా, శివరాంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్ లోని వశిష్ట, బర్కత్ పురాలోని హైందవి, ఎస్ఆర్ నగర్ లోని రెజోనెన్స్ కళాశాలలపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయా కాలేజీలపై కేసు నమోదు చేశారు.

ఈ ఎనిమిది కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని కూడా అధికారులు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేయడమేగాక, మరో 60 కాలేజీల ఎన్వోసీలను హైడ్ర అధికారులు పరిశీలిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Popular Articles