హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత యువతి చేసిన ఫిర్యాదులోని అంశాలను పంజాగుట్ట పోలీసులు తాము నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నివేదించారు.
ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్న సారాంశం ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన 22 ఏళ్ల ఓ యువతి మీడియా రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. తనకు కేవలం 18 ఏళ్ల వయస్సు గల సమయంలో.. అంటే 2022 సంవత్సరంలో ఒక ఇంటర్వ్యూ కోసం బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరిని కలిసింది. ఆ యువతి ఓ ప్రయివేట్ ఫ్లాట్ లో అతన్ని కలుసుకోవడానికి వెళ్లింది. తాను ఒక కొత్త యూ ట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నానని చెప్పి అక్కడ గల రేగా కాంతారావు ఆమెను పిలిచాడు. ఈ పేరుతో ఆమెను బలవంతంగా లైంగికంగా బలవంతం చేసి యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు.
అయితే 45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి తనను ఎలా పెళ్లి చేసుకుంటాడని ఆ యువతి ఆశ్చర్యపోయింది. కానీ అతను తన కుటుంబానికి, తనకు మధ్య ఉన్న విభేదాలను వివరించి ఆమెను మెప్పించాడు. తమ ప్రయాణంలో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అమీర్‌పేట్‌లో సంజోష్ అనే నటుడికి చెందిన ఒక ఫ్లాట్‌లో యువతి, కాంతారావు కలిసి నివసించారు. రేగ కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వారిద్దరూ అదే ఫ్లాట్‌లో నివసించేవారు. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె తనతో కలవడానికి నిరాకరించిన సందర్భంగా రేగ కాంతారావు ఆమె వ్యక్తిగత ఫోటోలు తీసి, అప్పుడప్పుడు బ్లాక్‌మెయిల్ చేసేవాడు.
ఇదీ చదవండి:
వీరిద్దరూ 2025 మధ్యకాలం వరకు శుభం అపార్ట్‌మెంట్స్‌లో శారీరక సంబంధాన్ని కొనసాగించారు. అనంతరం ఒక రియల్ ఎస్టేట్ ఆస్తిలో పెట్టుబడి పెడతాననే పేరుతో, రెట్టింపు డబ్బు ఇస్తానని చెప్పి రేగా కాంతారావు ఆమె నుండి రూ. 4.00 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుండి రేగా కాంతారావు ఆమెను దూరం పెట్టడం, ఆమె ఫోన్ కాల్స్‌కు కూడా సమాధానం ఇవ్వకుండా, ఆమెకు దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఆమెకు తెలియకుండా 2024 మే నెలలో అతను ఆమె మొబైల్ నుండి బాధిత యువతి స్నేహితుల కాంటాక్ట్ తీసుకుని, ఆమెతో మాట్లాడటం, కలవడం కూడా ప్రారంభించాడు.
ఈ అంశంలో బాధిత యువతి ప్రశ్నించినపుడు కాంతారావు ఖండించాడు. ఈ నేపథ్యంలోనే 2026 మార్చి నెలలో, ఫిబ్రవరి-మార్చి మధ్య ఆమె వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా, తాను తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, రేగకాంతారావు సోషల్ మీడియా హ్యాండ్లర్ ను సంప్రదించి, అతనికి విషయం మొత్తం వివరించింది. ఈ విషయం పెద్దది కాదని, రేగా కాంతారావుతో సమావేశం ఏర్పాటు చేస్తానని అతను బాధిత యువతితో చెప్పాడు. కానీ ఆ తర్వాత నిరాకరించి, రేగకాంతారావుకు అత్యంత సన్నిహితుడైన, సుప్రసిద్ధ కాంట్రాక్టర్ ముందుగా మీ డబ్బు తిరిగి చెల్లిస్తాడని యువతితో చెప్పాడు.
ఈ క్రమంలోనే బాధిత యువతి ఆన్‌లైన్‌లో షీ టీంకు ఫిర్యాదు చేయగా, తన ఖాతా నుంచే డబ్బు తీయడానికి ప్రయత్నిస్తోందని చెప్పి, ఆమె తనకు తెలియదని కూడా కాంతారావు చెప్పాడు. అయితే రేగా కాంతారావు వద్ద పెట్టుబడిగా పెట్టిన అసలు సొమ్ము తనకు తిరిగి వచ్చిందని, కానీ ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదని, పెళ్లికి సంబంధించిన విషయమని బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి పేరుతో తనను లైంగికంగా దోపిడీ చేసినందుకు, తప్పుడు వాగ్దానాలతో మోసం చేసినందుకు రేగా కాంతారావుపై అవసరమైన చర్య తీసుకోవాలని కోరంది.
కేవలం పెళ్లి చేసుకుంటానన్న మాట మీదే తాను రేగా కాంతారావును అంగీకరించానని, గత 4 సంవత్సరాలుగా అతను తనను లైంగికంగా చాలా హింసించాడని ఆరోపించింది. ఇదే సందర్భంలో రేగా కాంతారావు నుంచేగాక, అతని తరపున పనిచేస్తున్న వ్యక్తుల నుండి తనకు ఎదురయ్యే ఎలాంటి బెదిరింపులనైనా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కూడా బాధిత యువతి అభ్యర్థించారు.

