Top 5 This Week

Related Posts

డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: డీఎస్పీ భీంరెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు నార్సింగ్ లోని వేసెల్లా మెడోస్ విల్లాలో గల ఆయన ఇంట్లో రెండు ఏసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారనే అభియోగాలపై ఏసీబీ అధికారుల భీంరెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ ఉదయం 5.00 గంటల నుంచి ఏకబిగిన సోదాలు జరుగుతున్నాయి.

డీఎస్పీ భీంరెడ్డి వనస్థలిపురం, జహీరాబాద్, బాలానగర్, పటాన్ చెరు తదితర ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతతం డీజీపీ ఆఫీసులోని కంప్యూటర్ సర్వీసెస్ లో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో భారీ ఎత్తున భీంరెడ్డి అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా భీంరెడ్డి సంబంధీకుల ప్రాంతాల్లో చేస్తున్న ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

Popular Articles