పోక్సో కేసులో నల్లగొండ కోర్టు సోమవారం మరో సంచలన తీర్పునిచ్చింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దోమల రాము అనే వ్యక్తికి 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 30 వేల జరిమానా విధిస్తూ నల్లగొండ పోక్సో కోర్టు ఇంఛార్జి జడ్జి రోజారమణి తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ లో 2018 ఫిబ్రవరిలో నమోదైన ఈకేసులో వాద, ప్రతివాదనల అనంతరం కోర్టు ఈ తీర్పును వెలువరించింది. బాధిత కుటుంబానికి రూ. 10.00 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కూడా జడ్జి రోజారమణి ఆదేశించారు.


