Top 5 This Week

Related Posts

సైబర్ క్రైం పోలీసుల అదుపులో ఖమ్మం జర్నలిస్ట్

ఖమ్మం నగరానికి చెందిన ఓ విలేకరిని కరీంనగర్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఓ ప్రముఖ పత్రికకు ఖమ్మంలో విలేకరిగా పనిచేస్తున్న అతనిపై నమోదైన రెండు సైబర్ క్రైం కేసుల్లో కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ఇతను పాల్పడిన సైబర్ నేరాలకు సంబంధించి సహకరించిన మరికొందరు విలేకరులపైనా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. బహుషా వీళ్లను కూడా అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇటీవల ఖమ్మం నగరంలో జరిగిన మరో నేర ఘటనలోనూ ఇతని పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం ఉంది. అయితే ఈ ఉదంతంలో బాధితుని నుంచి ఫిర్యాదు లేని కారణంగా పోలీసులు చట్టప్రకారం ఇతనిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదంటున్నారు.

ఇదిలా ఉండగా ఖమ్మం నగంలోని మరికొందరు ప్రముఖ జర్నలిస్టులు సైతం ఖమ్మం పోలీసుల నిఘాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలోని పలువురు ప్రముఖులను, డాక్టర్లను, కొందరు సబ్ రిజిస్ట్రార్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో గల ఆయా జర్నలిస్టుల నిత్య కదలికలపైనా ఖమ్మం పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుకోసం ఎదురు చూస్తున్నామని, ఫిర్యాదు అందితే చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఖమ్మం పోలీసు వర్గాలు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం.

Popular Articles