ఛత్తీస్ గఢ్: బస్తర్ లో మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్రనేత కమాండర్ పాపారావ్ సహా 21 మంది నక్సల్స్ మరికాసేపట్లో ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ముందు లొంగిపోనున్నారు. మార్చి 31వ తేదీలోగా నక్సల్స్ రహిత భారతదేశంగా ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుసార్లు చేసిన ప్రకటనకు కేవలం ఆరు రోజుల ముందు బస్తర్ ప్రాంతానికి చెందిన చివరి మావోయిస్ట్ కమాండర్ పాపారావు 21 మందితో కలిసి జగదల్ పూర్ లో లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.
బస్తర్ ప్రాంతంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్ట్ పార్టీకి బహుషా ఇది చివరి దెబ్బగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. మావోయిస్ట్ కమాండర్ పాపారావు ఆయుధాలతో లొంగిపోవడం లాంఛనమేనని ఛత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మను ఉటంకిస్తూ ఓ జాతీయ ఆంగ్లపత్రిక తన వార్తా కథనంలో వెల్లడించడం గమనార్హం. లొంగిపోయిన నక్సలైట్లకు తమ ప్రభుత్వం భద్రతాపరంగా, సామాజిక స్రవంతి పరంగా అవసరమైన పునరావాస చర్యలను చేపడుతుందని కూడా విజయ్ శర్మ ప్రకటించారు.

