Top 5 This Week

Related Posts

ఇదీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆస్తుల చిట్టా!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి అరెస్టయ్యారు. మల్లారెడ్డి నివాసంలోనేగాక, ఆయనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు తదితర మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారనే అభియోగాలపై మల్లారెడ్డి నివాసంలో, ఇతర ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డిని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు తదుపరి విచారణ కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు.

Update:
ఇదీ మల్లారెడ్డి ఆస్తుల చిట్టా:
ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆస్తులపై ఏసీబీ మంగళవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నాలుగు నివాస గృహాలను, ఒక కమర్షియల్ బ్లాక్ ను, ఎనిమిది ఓపెన్ ప్లాట్లను, 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించినట్లు ఏసీబీ తెలిపింది.

మల్లారెడ్డి

అదేవిధంగా రూ. 3.31 లక్షల నగదు, రూ. 50.00 లక్షల బ్యాంక్ బ్యాలెన్సులను, మల్లారెడ్డి భార్య, కుటుంబ సభ్యుల పేర్లపై గల మూడు బ్యాంకు లాకర్లను గుర్తించారు. వీటిని త్వరలోనే తెరవనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు గ్రాండ్ విటారా కారును, ఓ టీవీఎస్ స్కూటీని కనుగొన్నామని, తనిఖీల్లో మొత్తం రూ. 3.00 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ ప్రకటించింది. మల్లారెడ్డిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు కూడా ఏసీబీ వెల్లడించింది.

Popular Articles