Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు

న్యూఢిల్లీ: తెలంగాణాలో ఖాళీ కానున్న రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి దించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తన అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే మార్చి నెలలో ఖాళీ అవుతున్నాయి. దీంతో ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.

మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామా రామ్మోహన్ రెడ్డిని, ఖమ్మం-వరంగల్-నల్లగొండ స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని ఎమ్మెల్సీ అభ్యర్థులకుగా ఖరారు చేసింది. ఈమేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వీరిద్దరి అభ్యర్థిత్వాలకు ఆమోద ముద్ర వేసినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

సామా రామ్మోహన్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తుండగా, సర్వోత్తమ్ రెడ్డి దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు. సర్వోత్తమ్ రెడ్డికి అటు నల్లగొండ జిల్లాలోనేగాక, తన పెదనాన్న, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి గల పేరు ప్రఖ్యాతులు ఖమ్మం జిల్లాలో కలిసొచ్చే అవకాశంగా కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

Popular Articles