Top 5 This Week

Related Posts

అబ్ధుల్లాపూర్ ఎమ్మార్వో, సర్వేయర్ అరెస్ట్

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్ధుల్లాపూర్ తహశీల్దార్ బి. సుదర్శన్ రెడ్డిని, సర్వేయర్ బతుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూసర్వే కోసం బాధితుల నుంచి రూ. 30.00 లక్షల మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేసి, రూ. 20.00 లక్షల నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకన్నారు.

హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం భూమి సర్వే నిర్వహించి, జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నివేదిక ఇచ్చేందుకు రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ ఈ ఇద్దరు రెవెన్యూ అధికారులు ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు.

మొదట రూ.30 లక్షలు డిమాండ్ చేసిన అధికారులు, చివరకు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ఫిర్యాదుదారుడి నుంచి మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులు రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

రూ. 20.00 లక్షల లంచం నగదుతో ఏసీబీకి చిక్కిన సర్వేయర్ శ్రీనివాసులు

సర్వేయర్ చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితం వచ్చినట్లు ఏసీబీ అధికారికంగా వెల్లడించింది. తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకే సర్వేయర్ లంచం తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

ఈ కేసులో తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి, మండల సర్వేయర్ బతుక శ్రీనివాసులును అరెస్టు చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇద్దరినీ మంగళవారం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ పేర్కొంది.

Popular Articles