Top 5 This Week

Related Posts

నక్సల్స్ మెరుపు దాడి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు నక్సల్స్ మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా, నాలుగు వాహనాలను నక్సలైట్లు దహనం చేశారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఈ ఘటన జరిగింది. ఇక్కడ గల నికో కంపెనీ గత కొన్నేళ్లుగా చిన్న డోంగార్ నామ్ డే గనిలో పనులు నిర్వహిస్తోంది. ఇందుకు నక్సలైట్లు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే శుక్రవారం రాత్రి మావోయిస్టు పార్టీకి చెందిన నక్సలైట్లు ఒక్కసారిగా ఇక్కడ మెరుపు దాడికి దిగినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు నివేదిస్తున్నాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించారని, మృతుడు నికో కంపెనీ ఉద్యోగా? లేక పోలీసా? అనే అంశంపై స్పష్టమైన సమాచారం లేదని స్థానిక మీడియా సంస్థల కథనం. ఘటనా స్థలానికి ఇంకా పోలీసులు చేరుకోలేదు.

Popular Articles