Top 5 This Week

Related Posts

సింగరేణి కార్మికులకు శుభవార్త

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పలు కారణాల వల్ల గత కొంతకాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతిత్వరలో ప్రారంభించాల్సిందిగా ప్రభుత్వం సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించింది. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది.

అదేవిధంగా సింగరేనిలో కారుణ్య నియామకాలను కూడా శనివారం ఇవ్వనున్నారు. కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు ఉద్యోగ నియామకపు పత్రాలను శనివారం మంచిర్యాలలో నిర్వహించే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందించనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సింగరేని యాజమాన్యాన్ని ఆదేశించింది.

Popular Articles