Top 5 This Week

Related Posts

మోగిన పంచాయతీ ఎన్నికల నగారా, నేటి నుంచే ‘కోడ్’ అమలు

హైదరాబాద్: తెలంగాణాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారని, రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు వివరించారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల కోడ్ మంగళవారం నుంచే అమలులోకి వస్తుందని ఎన్నికల సంగం కమిషనర్ రాణి కుముదిని పేర్కొన్నారు. తొలివిడత ఎన్నికలకు ఎల్లుండి నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు.

Popular Articles